తాళ్లూరు పోలీన్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తాళ్లూరు పోలీన్ స్టేషన్ పరిసరాలను, రికార్డులను, ప్రతి గదిని పరిశీలించి భవన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు శుభ్రంగా ఉండటం, క్లీన్ అండ్ గ్రీన్ గా ఆవరణ ఉండటం, మంచి ప్రశాంత వాతారణంలో స్టేషన్ పరినరాలు ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేసారు. సిబ్బందికి పలు సూచనలు చేసారు. దర్శి డీఎస్పీ లక్ష్మి నారాయణ, సీఐ రామా రావు, ఎన్ ఐ మల్లిఖార్జున రావు, ఎ ఎస్సై భాస్కర రావు లు ఆయన వెంట ఉన్నారు.
