జిల్లా వ్వాప్తంగా మహిళా భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు తెలిపారు.
త్రిపురాంతకం, దర్శి సర్కిల్స్ పరధిలో దొనకొండ, కురిచేడు, దర్శి సబ్ డివిజన్ కార్యాలయం, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు పోలీస్ స్టేషన్లను ఆయన అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మహిళల భద్రత కోసం శక్తి యాప్, శక్తి టీం లను ఏర్పాటు చేయటంతో పాటు ఉమెన్ డెస్క్ ఏర్పాటు చేసామని చెప్పారు. ప్రతి ఒక్క మహిళ వారి సెల్ ఫోన్ లలో శక్తి యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఎదైనా అత్యవసర సమయంలో శక్తి యాప్ ద్వారా సమాచారం ఇస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీస్ స్టేషన్లను పరిశీలించి క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకోవాలని సూచించారు. క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్న స్టేషన్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని కోరారు. ప్రజలకు ఎప్పుడు జవాబు దారిగా ఉండాలని అలా ఉన్నప్పుడే పోలీసులపై గౌరవం పెరుగుతుందన్నారు. ఆయా పోలీస్టేషన్ల రికార్డులను, ట్యాబ్లను పరిశీలించారు. దొనకొండలో శిథిలావస్థలో ఉన్న పోలీస్ స్టేసన్ను పరిశీలించారు. తాళ్లూరులో పాత భవనంలో ఉన్న ప్పుటికి పరిసరాలు చక్కగా ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేసారు. పలు చోట్ల మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాలలో ఆయన వెంట దర్శి డీఎస్పీ లక్ష్మి నారాయణ, త్రిపురాంతకం, దర్శి సీఐ లు జి అసాం. రామా రావు, ఎస్బీ న్స్పెక్టర్ ఎం శ్రీనివాస రావు, దొనకొండ, కురిచేడు, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు ఎస్ లు టి బ్రహ్మ నాయుడు, ఎం శివ, మురళి, కమలాకర్, మల్లిఖార్జున రావు, ఎఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు .







