వాహనాలు నడుపుతున్న మైనర్లకు పోలీసులు కౌన్సిలింగ్

ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు పట్టణంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించారు.
ఒంగోలు ట్రాఫిక్ సీఐ జగదీష్ , సిబ్బంది వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించారు.
వాహనాల నడుపుతున్న ప్రతి మైనర్‌కు రూ.5035/- జరిమానా విధించి, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. మైనర్ పిల్లలకు వాహనాలు నడపడానికి అనుమతి ఇవ్వకూడదని, అలాంటి అనుమతితో ఏదైనా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులూ చట్టపరంగా బాధ్యులవుతారని వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఇది మొదటి తప్పిదంగా పరిగణించి కేవలం జరిమానా మాత్రమే విధించామని, ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అదేవిధంగా ఓవర్ స్పీడ్, ఆపోజిట్ డ్రైవింగ్, సరైన పత్రాలు లేని వాహనాలపై కూడా జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా డ్రోన్ సహాయంతో పట్టణంలోని రద్దీ ప్రాంతాలను గుర్తించి, వాటి సమాచారం రూట్ మొబైల్ సిబ్బందికి హ్యాండ్‌సెట్‌ల ద్వారా అందజేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *