రాంగోపాల్ పేట,నవంబర్ 14(జే ఎస్ డి ఎం న్యూస్) :
విద్యార్థులు చిన్న నాటి నుంచే. వారికి ఆసక్తి ఉన్న ఆట పాటలలో పాల్గొని ప్రతిభను చూపాలని రాంగోపాల్ పేట్ కార్పొరేటర్ చీరె సుచిత్ర శ్రీకాంత్ అన్నారు.
శుక్రవారం ఓల్డ్ బోయిగూడా లోని కీర్తి హై స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా చీర సుచిత్ర శ్రీకాంత్ చేతుల మీదుగా చిన్నారులకు. ఆట ఉపకరణాలు (క్రికెట్. వాలీబాల్. టెన్నిస్. స్కిప్పింగ్ రోప్.) తదితర ఉపకరణాలతో పాటు. పలు రంగాలలో రాణిస్తున్నటువంటి చిన్నారి విజేతలకు జ్ఞాపికలను అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పిల్లలను ఉద్దేశించి భవిష్యత్తు తరాలలో మంచి మార్పులు తీసుకురావాలని అభ్యున్నతికి పాటుపడాలని దేశ భవిష్యత్తులో భాగస్వాములు కావాలని సూచించడం జరిగింది. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు చీర శ్రీకాంత్ మరియు. సీనియర్ నాయకులు ఎస్ఆర్ మల్లేష్ ఆనంద వ్యాస్. పులి మదన్.గోపి కిషన్ జి.శ్రీధర్ . మహేష్ సార్.నరేంద్ర పాల్.కమల్ శర్మ.కిరణ్ షా.తదితరులు పాల్గొన్నారు.

