హైదరాబాద్ నవంబర్ 14(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఈషా సింగ్ కు మంత్రి వాకిటి శ్రీహరిఅభినందించారు.ఈజిప్టులోని కైరోలో జరుగుతున్న
ఐ ఎస్ ఎస్ ఎఫ్ వరల్డ్ రైఫిల్ పిస్టోల్ ఛాంపియన్ షిప్ లో రెండు రజత పత కాలు ఒక కాంస్య పతకం గెలిచిన తెలంగాణ క్రీడాకారిణి ఇషా సింగ్ ను రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి లు అభినందించారు.
25 మీటర్ల పిస్టల్ మహిళల విభాగంలో 70 సంవత్సరాల తర్వాత భారతదేశానికి పతకం సాధించి చరిత్ర సృష్టించిన ఇషా సింగ్ కు వారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న క్రీడా ప్రోత్సాహక విధానాలతోతెలంగాణ యువ క్రీడాకారులు ప్రపంచ వేదికలపై అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారని వారు పేర్కొన్నారు.


