బేగంపేట నవంబర్ 14(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట్‌లోనిబ్రాహ్మణవాడీలో స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ సురభి వాణీదేవి పిల్లలకు ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు.వివిధ సాంస్కృతిక, క్రీడా మరియు సృజనాత్మక కార్యక్రమాలలో విజేతలైన విద్యార్థులకు వాణీదేవి బహుమతులు అందజేశారు. పిల్లల ప్రతిభను అభినందిస్తూ, సాంఘికమైన మార్పులకు పిల్లలే ఆధారస్థంభాలు. విద్య, విలువలు, క్రమశిక్షణ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి.అని పేర్కొనారు, సురభి సోలార్ డైరెక్టర్ శ్రీ శేఖర్ మారంరాజు,పాఠశాల ప్రిన్సిపాల్ వాసుకి , ఎస్‌ఆర్‌టీఎంసీ ఇన్‌చార్జ్ అరుణశ్రీ , పిల్లలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు.
పిల్లలలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంత ముఖ్యమో వారు వివరించారు. భవిష్యత్తులో కూడా సంస్థ తరపున విద్య, సంస్కృతి, సేవా కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు సహకరించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

