బేగంపేట నవంబర్ 14 (జే ఎస్ డి ఎం న్యూస్) :
ఎదుగుతున్న పిల్లల్లో వచ్చే విటమిన్ – డి లోపం, తుంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ఎండి, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి తెలిపారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా శుక్రవారం బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విద్యాసాగర్, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రీషన్ డాక్టర్ శాలిని మోహ్రోత్రాల ఆధ్వర్యంలో హాస్పిటల్లో చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా చిన్నారులతో డాక్టర్ గురవారెడ్డి సరదాగా మాట్లాడటంతో పాటు పిల్లల ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అనంతరం చిన్నారులకు చిల్డ్రన్స్ డే సందర్భంగా గిఫ్ట్ లను అందజేశారు.


