రెడ్డి గారి కార్తిక మాస వన భోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఈ నెలా 16వ తేదీన మల్లవరం లోని గుండ్లకమ్మ రిజర్వాయర్ వొద్ద నిర్వహిస్తున్నట్లు రెడ్డి జనాభ్యుదయ సంఘం అధ్యక్షులు కెవి. రమణా రెడ్డి తెలిపారు. ఒంగోలు లోని రెడ్డి హాస్టల్ లో జరిగిన సమావేశంలో కార్యక్రమం వివరాలను ఆయన వెల్లడించారు. రెడ్డి జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో వన బోజన మహోత్సవ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులతో పాటుఆర్థికంగా,రాజకీయంగా,వ్యాపారవేత్తగా స్థిరపడిన ప్రముఖుల హాజరు అవుతాయని తెలిపారు.కార్యక్రమంలో పూజ కార్యక్రమాలు,ఆట పాటలు,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వన బోజన మహోత్సవాలకు విచ్చేసే రెడ్డి కుటుంబ సభ్యులకు వాహన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్డి సోదరి సోదరీమణులు అందరూ పాల్గొని విజయవంతం చేసి ఐక్యత చాటాలని కోరారు. సమావేశంలో పలగాని రామసుబ్బారెడ్డి, పోలవల్లి నరసింహ రెడ్డి, హాస్టల్ ఫౌండర్ పి.వెంకటరామిరెడ్డి, వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి, నల్లమలపు బ్రహ్మారెడ్డి, ఎన్.ఎల్ నరసా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
