బాలల హక్కులే మానవ హక్కులు – ఎంఈఓ నుబ్బయ్య

బాలల హక్కులే మానవ హక్కులని మండల విద్యాశాఖాధికారి జి నుబ్బయ్య అన్నారు. డిబి ఆర్ సి ఆధ్వర్యంలో శుక్రవారం శివరామపురం ఉన్నత పాఠశాలలో బాలల హక్కుల ప్రచార ఉద్యమం నిర్వహించారు. డిబిఆర్ సి జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వర రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఎంఈఓ- నుబ్బయ్య మాట్లాడుతూ రక్షణ, ప్రేమ, విద్య నమాన అవకాశాలు బాలలకు కల్పించటం మన బాధ్యత అని అన్నారు. ఎంఈఓ -2 నుధాకర్ రావు మాట్లాడుతూ ప్రతి చిన్నారికి జీవించటానికి, నేర్చుకోవటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఉన్న హక్కులను వాటిని ఉపయోగించుకుని ఉన్నతంగా ఎదగాలని కోరారు. ముందుగా పండిట్ జవహార్ నెహ్రు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు కె వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బొద్దికూరపాడు మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల (జనరల్) లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ప్రధానోపాధ్యాయుడు నుబ్రమణ్యచారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎన్ఎంసీ చైర్మన్ జి శివారెడ్డి, రిటైర్డ్ ఏన్ ఏ ఎన్ అంజి రెడ్డి, ఉపాధ్యాయులు బివి ఎన్ శర్మ, ఎం హరిత, విజయకుమారి, రేవతి, అంగన్ వాడీ టీచర్ నాగమణిలు పాల్గొని ఛాచాజీ నేహ్రు చిత్ర పటానికి నివాళులు అర్పించారు. విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు, మిఠాయిలు పంచి పెట్టారు.

వెలుగు వారి పాలెం (ఏఏ) పాఠశాలలో నెహ్రూ జీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఫాస్టర్ సాల్మన్ రాజు అంగన్ వాడీ కేంద్రంలోని చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పోలం రెడ్డి సుబ్బా రెడ్డి, అంగన్ వాడీ టీచర్ సునీత తదితరులు పాల్గొన్నారు.

పలు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఛాచా నెహ్రు జన్మదిన వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసారు.

కాగా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ నాయకుల జయంతి, వర్ధంతి వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికి ఎంపీడీఓ, తహసీల్దార్, ఉపాధి హామీ, వెలుగు కార్యాలయాలతో పాటు ఏ ఒక్క కార్యాలయాల్లో నెహ్రు జయంతి వేడుకలు నిర్వహించడ పోక పోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *