జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గుంటి గంగా భవాని దేవస్థానం పేరుతో విరాళాలు సేకరించి తనకు సంబంధించిన సభ్యులతో ట్రస్ట్ సత్రాన్ని మార్పు చేసిన ఆలయకమిటీ మాజీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మాం ఒంగోలులో దేవదాయశాఖ అధికారులకు తాళం, సత్రంకు సంబంధించిన పత్రాలు శుక్రవారం అందజేశారు. వివరాల్లోనికి వెళ్తే..
ఆలయ కమిటీ తాజా మాజీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మాం గుంటిగంగమ్మ ఆలయకు కమిటీ ఆద్వర్యంలో అన్నదాన సత్రం పేరిట దాతలు, భక్తుల నుండి నిధులు సమ కూర్చి సత్రం భవానాన్ని నిర్మించారు. ఆసత్రంను శ్రీగంగమ్మ అన్నదాన ట్రస్ట్ సత్రం గా మార్పు చేయటంపై పలువురు నుండి ఫిర్యాదులు అందాయి. దీనిపై దేవదాయశాఖ డిప్యూటీ కమీషనర్
శ్రీనివాసరావు స్పందించిఆలయ ఈవో వాసుబాబు ద్వారా నివేధిక తీసుకున్నారు. ఆలయ దేవస్థాన సత్రం నిర్మాణం పేరిట నిధులు వసూలు చేసి నిర్మించిన సత్రాన్ని శ్రీగంగమ్మ..
సత్రంనిర్మాణం పేరిటనిధులు వసూలు చేసి నిర్మించిన సత్రాన్ని శ్రీగంగమ్మ అన్నదాన ట్రస్ట్ సత్రంగా మార్చి దేవదాయశాఖ చట్టానికి విరుద్ధంగా వ్యవహరించి, అన్నదాన సత్రాన్ని ఆల యానికి అప్పగించనందున ఆలయమాజీ కమిటీ చైర్మన్ కోసనా గురుబ్రహ్మంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ
చేశారు. దీంతో ఈవో వాసుబాబు గురువారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చేసిన తప్పును అంగీకరించిన మాజీ చైర్మన్ గురుబ్రహ్మం ఒంగోలు వెళ్లి దేవదాయశాఖ అధికారులు వాసుబాబు, ఆర్ఏ ప్రసాద్ కు దేవస్థానసత్రం తాళాలు, సంబంధిత రికార్డులను అప్పగించి దేవస్థానంకు స్వాధీనం చేశారు.
