కూకట్ పల్లి నవంబర్ 15
(జే ఎస్ డి ఎం న్యూస్) :
అయ్యప్ప మాల ధారణ ఎంతో పవిత్ర మని టి పి సి సి ఉపాధ్యక్షులు,కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ బండి రమేష్అన్నారు. శనివారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు తూము మనోజ్ కుమార్ ఆహ్వానం మేరకు ప్రగతి నగర్ లోని ఆయన స్వగృహం లో ఏర్పాటు చేసిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజలో బండి రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసారు.ఈ కార్యక్రమం లో అయ్యప్ప స్వాములు, భక్తులు, మరియు కాంగ్రెస్ నాయకులు బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మయ్య, గాలి బాలాజీ, కర్క పెంటయ్య, ఎన్ ఎస్ నారాయణ, ఎండీ మొయినుద్దీన్, తూము వినయ్, సప్పిడి భాస్కర్, ఎండీ చున్నుపాషా, తూము సంతోష్, రమేష్, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

