మొంధా తుఫాన్ లో సమర్థవంతంగా పనిచేసిన అధికారులకు జిల్లాలో శనివారం జరిగిన ప్రత్యేక అభినందన కార్యక్రమంలో తాళ్లూరు మండలంలో ఇరువురు అధికారులకు సత్కారం లభించింది. తహసీల్దార్ బి వి రమణా రావు, శివరామపురం వి. ఆర్. ఓ చంధ్రశేఖర్ రావు లు ఈ అవార్డులు అందుకున్నారు. అవార్డులను జిల్లా కలెక్టర్ రాజా బాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణలు అవార్డులను అందించారు. ఉత్తమ సేవలు అందుకున్న తహసీల్దార్, విఆర్ ఓలకు పలువురు ప్రజాప్రతినిధులు, మిత్రులు, ప్రజలు అభినందనలు తెలిపారు.

