ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో తమ పాత్రను పోషిస్తూ ప్రకాశం జిల్లా పోలీసులు ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలసి జిల్లా పోలీసు కార్యాలయం సహా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టారు.
పోలీస్ కార్యాలయ ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేసి, చెత్తను తొలగించారు. గుణపం, పారలు ఉపయోగించి పిచ్చి మొక్కలను తొలగించారు. ఇలా శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ, పర్యావరణ పరిరక్షణకు తమ పాత్రను పోషించారు. మురుగునీటి పారుదల కాలువలను శుభ్రం చేసి, పరిసరాలను పరిశుభ్రం చేయడానికి బ్లీచింగ్ పౌడర్ చల్లి శుభ్రం చేశారు. అనంతరం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ ను కూడా చేశారు.
అన్ని పోలీస్ స్టేషన్ లలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలసి శుభ్రం చేయడంతో పాటు ఆవరణం మరియు చుట్టూ ఉన్న చెత్త, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. గుణపం, పారలు చేతబట్టి పిచ్చి మొక్కలు తొలగించారు. చెట్లకు పాదులు తీసి నీరు పోశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా ఈ కార్యక్రమం చేపట్టారు. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని అందువలన మనసు ప్రశాంతతతో కూడి ఆరోగ్యకర వాతావరణంలో, క్రమశిక్షణగా విధులు నిర్వర్తించొచ్చు. మన చుట్టూ ఉంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అని అన్నారు.
సమాజంలో శాంతియుత వాతావరణం, పరిశుభ్రమైన వాతావరణం రెండూ సమానంగా ముఖ్యమని భావించి పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.



