ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు , డి. ఎస్. పి లక్ష్మీ నారాయణ , సి. ఐ రామారావు ఆదేశాల మేరకు ఎస్. ఐ మల్లిఖార్జున రావు తూర్పు గంగవరం లో తన సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించారు.వాహనాలు నడుపుతున్న మైనర్లు గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించారు. మైనర్ పిల్లలకు వాహనాలు నడపడానికి అనుమతి ఇవ్వకూడదని, అలాంటి అనుమతితో ఏదైనా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులూ చట్టపరంగా బాధ్యులవుతారని వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఇది మొదటి తప్పిదంగా పరిగణించి హెచ్చరించి వదిలేస్తున్నామని, ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని సూచించారు.
అదేవిధంగా హెల్మెట్ లేని వాహనదారులకు ,ఓవర్ స్పీడ్, ఆపోజిట్ డ్రైవింగ్, సరైన పత్రాలు లేని వాహనాలపై కూడా కౌన్సెలింగ్ నిర్వహించారు.


