బేగంపేట నవంబర్ 16(జే ఎస్ డి ఎం న్యూస్ ):
బేగంపేట మయూరి మార్గ్ లోని అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ లో నూతన విద్యుత్ బోరు ను కూకట్ పల్లి నియోజకవర్గం
బీ జే పి ఇంచార్జి మాధవరం కాంతారావు ఆదివారం అసోసియేషన్ అధ్యక్షులు పి.మోహన్ ,మాజీ అధ్యక్షులు పి.రాజలింగం ,రాములు,బేగంపేట డివిజన్ బి జె పి నాయకులు యామగోని గంగాధర్ గౌడ్,సి.విజయ్ కుమార్ తదితరులతో కల్సి ప్రారంభించారు. అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధి కార్యక్రమాలలో. భాగంగా భవనం లో కార్యక్రమాలునిర్వహించుకునేందుకు వీలుగా రెండవ అంతస్తు నిర్మాణం,భవనం లో విద్యుత్ బోరు కోసం మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ రూ 13లక్షల రూపాయల నిధులను విడుదలచేశారు .ఈకార్యక్రమంలో భాగంగా బోరు ను ప్రారంభించగా అదనపు గది నిర్మాణం చేయాల్సి ఉందని మాధవరం కాంతారావు తెలియ జేశారు.ఈటెల రాజేందర్ సహకారంతో కూకట్ పల్లి నియోజక వర్గం పరిధిలో అభి వృద్ధి పనుల అమలు కోసం బీ జే పి తరుపున తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కాంతా రావు తెలియ జేశారు.ఈ సందర్భంగా అసోసియేషన్ తరుపున మోహన్,రాజలింగం తదితర కమిటీ సబ్యులు కాంతారావును శాలువాతో సత్కరించారు.ఈకార్యక్రమంలో నాయకులు శ్రీరామ్,బాలశంకర్ ,నరసింహ,రఘురాం,వెంకట్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.
