ఐకమత్యంగా కమ్మసోదరులు ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో రాణించాలని కమ్మ సేవాసమితి నేతగొల్లపూడి సుబ్బారావు అన్నారు. గుంటిగంగసన్నిధిలో గల కాకతీయ కమ్మ అన్నదాన సత్రంలో కార్తీక వనభో జనాలు ఆదివారం జరిగాయి. సత్రం కమిటీ అధ్యక్షులు గాలి వెంకటేశ్వర్లు అధ్యక్ష తన జరిగిన సమావేశంలో మాట్లాడారు. అందరం కలిసి కట్టుగా వుంటే ఎలాంటి సమస్యలనైనా సున్నితంగా పరిష్కరించుకోవచ్చునన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారు అనేక పదవుల్లో ఉన్నతులుగా నిలిచారని, ఇబ్బందుల్లోనున్న వారికి ఆదుకునేందుకు ముందుకురావాలన్నారు. పేద కుటుంబాల్లో వున్న వారి పిల్లలు విద్యకు దూరం కాకుండా చదువు కునేలా చూడాలన్నారు. అలాంటి కుటుంబాల కోసం కమ్మసేవా సమితి ఆద్వర్యంలో విద్యాలయం నిర్మించ తలిస్తే తన వంతుగా రూ. 1లక్ష విరాళం అందజేస్తానన్నారు. నాగంబొట్లపాలెం సొసైటీ అధ్యక్షులు
నాగంబొట్లపాలెం సొసైటీ అధ్యక్షులు వల్లభనేని సుబ్బయ్య మాట్లాడుతూ అందరు ఐకమత్యంగా ముందుకు సాగితే అన్ని రంగాల్లో రాణించ వచ్చునన్నారు. ఈర్ష్యా ద్వేషాలు విడనాడి అందరి అభ్యున్నతికి పాటు పడాలని, తనవంతు సహకారం అందిస్తానన్నారు. ముందుగా సత్రంలో వున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాలులు అర్పించారు. భారీ
అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి లింగయ్య, కాట్ర గడ్డ రమణయ్య, చల్లపల్లి చంద్రశేఖర్, మందాటి శ్రీను, జాష్టిశివబ్రహ్మం,తదితరులు పాల్గొన్నారు.

