రెడ్డి అంటే అన్ని కులాలను సమానంగా చూసేవాడని జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మల్లవరం వద్ద ఉన్న గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద రెడ్డి జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు . కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బూచేపల్లి మాట్లాడుతూ… రెడ్డి అంటే పరిపాలించే వాడని అన్నారు. తమతో పాటు తమ చుట్టూ ఉన్న వారిని కూడా వృద్ధిలోకి తీసుకురావాలనే తత్వం రెడ్డి కులానికి మెండుగా ఉంటుందని ఆయన అన్నారు. తన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి తల్లి బూచేపల్లి వెంకాయమ్మ ల పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా రెడ్డి జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహిస్తున్న రెడ్డి హాస్టల్ కు తగు సౌకర్యాలను ఏర్పాటు చేయగలిగామని ఆయన తెలిపారు. పేద స్థితిలో ఉండి చదువుతున్న విద్యార్థులకు ఈ సంఘం ద్వారా చేయూతనివ్వడం అభినందచించదగిన విషయం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా సంఘం పనిచేయడం అభినదించదగిన విషయమని ఆయన కొనియాడారు. రెడ్డి కులస్తులు వాళ్ల వారినే కాకుండా చుట్టుపక్కల ఉండేవారు సంతోషంగా ఉండాలని కోరుకుంటారని అలాంటి తత్వమే తనకు అబ్బిందన్నారు. ప్రజలకు మంచి చేయటానికి తమ కుటుంబం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచి ఇప్పటివరకు పదిమంది రెడ్డి కులానికి చెందినవారు ముఖ్యమంత్రులు అయ్యారని, వారిలో నీలం సంజీవరెడ్డి ఏకంగా రాష్ట్రపతి అయ్యారని ఇందుకు వారు ప్రజలకుచేసిన మేలు, వారి పరిపాలన దక్షతలే కారణమన్నారు. రాష్ట్రకూటుల నుంచి రెడ్డి పదం ఉద్భవించిందని వందల సంవత్సరాలుగా పరిపాలన చేసే వారిని రెడ్డి అని పిలుస్తూ ఉండేవారని ఆయన తెలిపారు. రెడ్డి సోదరులందరూ ఐకమత్యంగా ఉండి సోదర భావంతో మెలుగుతూ మనకు మేలు చేసే వారిని గుర్తిస్తూ వారిని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఒంగోలులోని రెడ్డి హాస్టల్ కు తమకు తోచిన విధంగా విరాళాలు ఇవ్వాలని ఆయన ప్రోత్సహించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి జనాభ్యుదాయ సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలకు మా తండ్రి గాని నేను గాని ఎప్పుడు అండగా ఉంటామని అన్నారు.పలువురు వక్తలు మాట్లాడుతూ రెడ్డిల పూర్వ వైభవం గురించి, బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి వివరించారు. ముందుగా జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన శివలింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉదయం నుండి చిన్నారులకు ఆటపాటలు ఏర్పాటు చేయగా అందరూ ఉల్లాసంగా గడిపారు. మధ్య మధ్యలో సాంస్కృతిక నృత్యాలు, విద్యార్థుల కోలాటం వంటి అంశాలు ఆకట్టుకున్నాయి.అనంతరం కమిటి సభ్యులు దర్శి ఏమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి , జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మకు , బాలినేని ప్రణీత్ రెడ్డి లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మేదరమెట్ల శంకరా రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి, కె.వి రమణారెడ్డి, ప్రసాద్ రెడ్డి( బన్నీ)పి. శంకరరెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు ఎంపీపీ పల్లపోలు మల్లికార్జున రెడ్డి, హెచ్ఎం పాడు ఎంపీపీ సావిత్రి, మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, నాగులుప్పలపాడు ఎంపీపీ నల్లమలకు అంజమ్మ కృష్ణారెడ్డి, ముండ్లమూరు ఎంపీపీ సుంకర బ్రహ్మారెడ్డి, సంతనూతలపాడు జడ్పిటిసి దుంప రమణమ్మ, పలువురు నాయకులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






