బేగంపేట నవంబర్ 17(జే ఎస్ డి ఎం న్యూస్) :
కార్తీక మాసం సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళీ అమ్మవారి ఆలయంలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.కార్తీక మాసం
లో భాగంగా సోమవారం ఉదయం ఆలయంలో
ఈ ఓ మనోహర్ రెడ్డి,ఫౌండర్ ఫ్యామిలీ మెంబెర్స్ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. సోమవారం రోజున ఉదయం నుంచి మహాకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారికి,స్వామి వార్లకు పూజలు చేశారు.కార్తీక మాసం చివరి సోమవారం కావడం తో జంట నగరాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు కుటుంబాలతో తరలి వచ్చి పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పూలు,విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.భక్తులకు
తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా ఈ ఓ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక మాసంలో శ్రీ ఉజ్జయినీ మహాకాళీ అమ్మవారి అమ్మవారు, శ్రీ మహా కాళేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించుకోవడం భక్తులకు ఎంతో పుణ్య ఫలం అని అన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయంలో పటిష్టమైన ఏర్పాట్లుచేశామన్నారు.ఆలయంలో నిత్యం కార్తీక దీపాలను వెలిగిస్తుండటంతో ఆలయం లో కార్తీక శోభ నెలకొందని ఈ ఓ తెలియ జేశారు.
