బేగంపేట నవంబర్ 17
(జే ఎస్ డి ఎం న్యూస్) :
విద్యార్థులు సమయ పాలన పాటించడం తో పాటు వచ్చిన అవకాశాలను అందిపుచ్చు కోవాలి అని ఆర్బీఐ రిటైర్డ్ అధికారి డా.కే.ఎస్.ప్రసాద్ పిలుపు నిచ్చారు.డా.బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సోమవారం బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025 .26 విద్యా సంవత్సరానికి సంబంధించిన బీ ఎస్సీ,బీ ఏ, బీ కాం విద్యార్థుల కోసం ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్బీఐ రిటైర్డ్ అధికారి డా. కే.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్య సాధన లో ముందుకు సాగాలన్నారు.విద్యతో పాటు సంఘ సేవలో కూడా పాలు పంచుకోవాలని అన్నారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల రీజినల్ కో ఆర్డినేటర్ డా.మారోజూ రామాచారి మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యా ప్రయాణాన్ని కొత్త ఉత్సాహంతో ప్రారంభించాలని ,ఓపెన్ యూనివర్సిటీ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ,సిబ్బంది,పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

