స్వా మిత్ర సర్వేలో తమ నివాసాలకు, ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఎంపీడీఓ అజిత కోరారు. మాధవరం గ్రామంలో సోమవారం సర్పంచి తాటికొండ రేణుక అధ్యక్షతన స్వామిత్ర సర్వే ఫేజ్ -2 లో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో జిల్లా నుండి అందిన సమాచారం మేరకు 473 పీపీఎం లను పరిశీలించి పూర్తి స్థాయిలో గ్రామ సభలో ప్రజల ముందు చదివి వినిపించారు. అందులో 152 మంది యజమానుల అంగీకారం తీసుకున్నారు. పలు అభ్యంతరాలను సభ దృష్టికి తెచ్చారు. డిప్యూటి ఎంపీడీఓ నాగ మల్లేశ్వరి, గ్రామ కార్యదర్శి షహనాజ్ బేగం, నచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
