తమ పిల్లలు ఇద్దరు వెన్నేముక కండరాల క్షీణత ( ఎస్ఎం ఏ) వ్యాధితోబాధపడుతున్నారు. వైద్యం కోసం లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఆదుకోవలసిన వారు ఆదుకోవటం లేదు. కనీసం పొలం అమ్మి అయినా సరే వైద్యం చేయించుకోవాలంటే జాయింట్ ఎల్ పీఎం లో పడి అమ్మకానికి వీలు కావటంలేదని మాధవరం గ్రామానికి చెందిన కొడిమెల వెంకట రావు సోమవారం గ్రీవెన్స్ సెల్ లో ఎస్ ఎం ఏ వ్యాధితో బాధపడుతున్న కుమారులను తీసుకువచ్చి ఆవేదన వ్యక్తం చేసారు. స్పందించిన తహసీల్దార్ బివి రమణా రావు తహసీల్దార్ కార్యాలయం బయటకు వచ్చి ఆవేదన విన్నారు. తక్షణమే పరిశీలించి సర్వే చేయించి న్యాయం చేస్తామని తెలిపారు. తమ వాటా 26 సెంట్లలో 13 సెంట్లు తమకు వస్తుందని, ఆ పొలం ను 13 లక్షలకు అమ్మానని, త్వరగా న్యాయం చేస్తే రిజిస్ట్రేషన్ చేస్తే నగదు వస్తుందని వైద్యానికి ఉపయోగపడతాయని విన్నవించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి తగిన న్యాయం చేస్తామని తెలిపారు.
