పాడి రైతులు ప్రభుత్వం అందిస్తున్న నబ్సిడీ దాణాను ఉపయోగించుకోవాలని జెడ్పీటీసీ
మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి లు కోరారు. స్థానిక పశువైద్యశాల ఆవరణలో సోమవారం పాడి రైతులకు నబ్సిడీపై అందిస్తున్న పశువుల దాణాను పంపిణీ చేసారు. పశుసంవర్థశాఖ దర్శి ఎడీ డాక్టర్ ఎ పురుషోత్తం రాజు మాట్లాడుతూ మండలంలో 5 టన్నుల పశువుల దాణా నబ్సిడీపై మంజూరు అయినదని చెప్పారు. పూర్తి ధర రూ. 1110 కాగా, రైతు తమ వాటా రూ. 555 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. మండలంలో వంద బ్యాగ్గులు పశువుల దాణా అందుబాటులో ఉందని తెలిపారు. కార్యక్రమంలో తాళ్లూరు , తూర్పు గంగవరం పశువైద్యాధికారులు డాక్టర్ ప్రతాప్ రెడ్డి ,డాక్టర్ వంశీ , రజానగరం, బెల్లంకొండ వారి పాలెం సర్పంచిలు వలి, పీ ఎస్ శ్రీకాంత్ రెడ్డి, టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
