ఏకలవ్వనగర్ కాలనీ వాసులకు చెందిన 62 మందికి సాగు భూమి పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్దంగా వున్నామని తహసీల్దార్ బి. విరమణారావు ఎస్టీలకు హామీ ఇచ్చారు. సోమవారంసాయంత్రం ఏ క లవ్వనగర్ ఎస్టీ కాలనీ వాసులు కొందరు తహసీల్దారు కలిశారు. ఏకలవ్వనగర్ ఎస్టీ కాలనీ వాసులుఎంతో కాలంగా అప్రాంతంలో నివాస ముంటుండగా కొందరికే ఇచ్చారని, మిగిలిన వారు ఎన్నో ఏళ్లుగా తిరుగుతున్న పట్టాలుఎందుకు ఇవ్వటం లేదని ఎస్టీలు తహసీల్దారు అడిగారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ మాట్లాడుతూ గతంలో అకాలనీకి చెందిన 46 మంది రాష్ట్ర హైకోర్టుకుపట్టాల పంపిణీ చేయాలని ఆశ్రయించారన్నారు. వారికి పట్టాలు పంపిణీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. పట్టాల పంపిణీ జరుగక పోవటంతో 46 మందిలో 31 మందికి పట్టాలు పంపిణీ చేయాలని ఉత్తర్వులు ఇవ్వగా అర్హతగల జాబితాను సిద్ధం చేశామన్నారు. వారిలో 26 మందికి పట్టాలు పంపిణీ చేయటం జరిగిందన్నారు. అప్రాంతంలో ఎంతో కాలంగా నివాసముంటూ అర్హత గల జాబితాను సిద్ధం చేశామన్నారు. వారిలో 26 మందికి పట్టాలు పంపిణి చేయటం జరిగిందన్నారు. అప్రాంతంలో ఎంతో కాలంగా నివాసముంటూ భూములు సాగుచేసుకుంటున్న అర్హులను 62 మందిని గుర్తించామని, వారికి రెండవ జాబితా లో పట్టాలు పంపిణీ చేయటం జరుగుతుందన్నారు.ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ఎస్టీలకు పూర్తి న్యాయం చేస్తామన్నారు. ఎ వరూ అపోహపడ వద్దని రెండోజాబితా సిద్ధం చేస్తున్నామని అర్హులందరికి పట్టాల పంపిణీ తన హయాంలో చేస్తానని తహసీల్దార్ ఎస్టీలకు హమీ ఇచ్చారు.
