ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా, ప్రతి ఫిర్యాదును సమర్థవంతంగా పరిశీలించాలి – ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు – ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 130 ఫిర్యాదులు

ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు  సోమవారం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (మీ కోసం) కార్యక్రమంను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదిదారుల  వ్రాతపూర్వక వినతులను ఎస్పీ స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల సమస్యలను  అడిగి తెలుసుకుని వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అందిన ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదుదారుల వివరాలు తెలియజేసి, తక్షణ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోని భాధితులకు న్యాయం అందించాలని, జవాబుదారీతనంతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా  నిర్ణీత గడువులో ఫిర్యాదులు పరిష్కారించాలని అధికారులను   ఆదేశించారు.

ఫిర్యాదు చేయడానికి వచ్చే వారిలో కొంత మంది వృద్ధులు, నడవలేని స్థితిలో ఉండేవారు ఫిర్యాదు చేయడానికి వస్తూ ఉంటారని, అలా వచ్చిన వారికి మర్యాదపూర్వకంగా వారి సమస్యలను విని సత్వర న్యాయం అందిస్తామని భరోసా వారిలో కలిగించాలని, సంఘటన ప్రదేశాన్ని సందర్శించాలని పోలీస్ అధికారులను  ఆదేశించారు.

జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ  తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎక్కువగా సివిల్/భూ/ఆర్థిక తగాదాలు, అత్తరింటి వేదింపులు,ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలు, చీటింగ్ మొదలగు ఫిర్యాదులు ఉన్నాయి.

*ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని….*

– తన మనవడు పలుమార్లు కొట్టాడని, తన కోడలు డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని న్యాయం చేయాలంటూ కొనకనమిట్ల మండలం, నాగంపల్లి గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలు (80 సం’) ఫిర్యాదు.

–  తాను ఇంట్లో ఒంటరిగా ఉండటం వల్ల తన వద్ద ఉన్న  బంగారు ఆభరణాలను భద్రంగా ఉంచాలని తన అల్లుడికి ఇచ్చినట్లు, అవసరాల నిమిత్తం బంగారం తిరిగి ఇవ్వమని అడుగుతున్నప్పటికీ ఆయన వివిధ కారణాలు చూపుతూ బంగారం ఇవ్వడంలేదని మార్కాపురం మండలానికి చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేసింది.

– తన కార్లు అమ్మిస్తానని చెప్పి తీసుకెళ్లిన వ్యక్తి, ఆ కార్లకు నకిలీ నంబర్ ప్లేట్లు పెట్టుకుని తిరుగుతూ, కార్లు తిరిగి ఇవ్వమని అడిగితే తిడుతూ బెదిరిస్తున్నాడని ఒంగోలు, శ్రీనగర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు.

–  తనకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు రూ. 1,95,000/- తీసుకుని, నకిలీ అపాయింట్మెంట్ లెటర్ పంపించి ఉద్యోగం ఇప్పించకపోగా, తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరిస్తున్నారని  జరుగుమల్లి మండలానికి ఒక యువకుడు ఫిర్యాదు.

– తన కుమారుడు దివ్యాంగుడని  బండి ఇప్పిస్తానని నమ్మబలికి, తన వద్ద నుండి ఒంగోలు, బలరాం కాలనీ కి చెందిన వ్యక్తి రూ.7,000/- రూపాయలు అలాగే మెడికల్ టెస్టుల కోసం అతని భార్యరూ. 6000/- డబ్బులు తీసుకున్నారని, అదేవిధంగా మరికొంతమందిని కూడా పలు రకాలుగా మోసం చేసిన వ్యక్తి, కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ఎలాంటి సమాధానం చెప్పటం లేదని ఒంగోలు బాలాజీ నగర్‌కు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు.

ఈ కార్యక్రమంలో పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఒంగోలు రూరల్ సీఐ యన్.శ్రీకాంత్ బాబు, పొదిలి సీఐ యం.రాజేష్ కుమార్,గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, పామూరు సీఐ యం.శ్రీనివాసరావు సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *