గర్భిణీస్త్రీకి సకాలములో అన్ని సేవలు అందించి ప్రీమెచ్యూరిటీ మరణాల నివారిణి లక్ష్యంగా ఆరోగ్య శాఖ పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు.
స్పందన సమావేశమందిరంలో సోమవారం ప్రపంచ ప్రీమెచ్యూరిటీ దినోత్సవం కార్యక్రమును జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బముగా జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ ప్రీమెచ్యూరిటీ దినోత్సవం నవంబర్ 17న జరుపుకుంటామని, ప్రతి గర్భిణీస్త్రీకి సకాలములో అన్ని సేవలు అందించి ప్రీమెచ్యూరిటీ మరణములను నివారించవలసినదిగా తెలిపినారు ఇది నెలలు నిండకుండా పుట్టిన శిశువులు మరియు వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెంచడానికి ఉద్దేశించబడిందని తెలిపారు. ప్రధాన ఉద్దేశ్యం నెలలు నిండకుండా పుట్టే శిశువుల ఆరోగ్యం మరియు మనుగడ కోసం తగిన సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించడం అకాల శిశువులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, వైకల్యాలు మరియు అభివృద్ధిలో జాప్యాలను తగ్గించడం ముందస్తు జననాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవడం ముందస్తు శిశువులకు మరియు వారి కుటుంబాలకు మద్దతు ఇవ్వటం అని అన్నారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి. వెనకటేశ్వర్లు మాట్లాడుతూ..
ప్రతి గర్భిణీస్త్రీకి ఎ యన్ యమ్ వద్ద రిజిస్టేషన్ అయినా తరువాత ఆమెకు అందవలసిన అన్ని సేవలను సకాలంలో అందించి వివరములను యమ్ సి పి కార్డ్ నందు నమోదుచేయవలెనని చెప్పారు. ప్రమాద సంకేతములుగల గర్భిణీస్త్రీలను గుర్తించి వారికీ విధిగా సమీపములో ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి వారికి అని సేవలను సకాలములో అందించి వివరాలను గర్భిణీస్త్రీకి వారి బందువులకు తెలియపరచవలెనని తెలిపారు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసియున్న వసతులను గర్భిణీస్త్రీకి వారి బందువులకు తెలియపరచి శిశుమరణములను నివారించవచ్చుని తెలిపారు. ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 15 మిలియన్ల మంది పిల్లలు అకాల శిశువులుగా జన్మిస్తున్నారుని , ఇది ప్రపంచవ్యాప్తంగా పుట్టే పది మంది శిశువులలో ఒకరు ఉన్నారని తెలిపారు. ఈ అంశంపై అవగాహన చాలా ముఖ్యం మని , అకాల ప్రసవం గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి, అకాల శిశు జననాల వల్ల ఎదురయ్యే సవాళ్లపై దృష్టి సారించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారని
వివరించారు.
కార్యక్రమములో డాక్టర్ కమలశ్రీ జిల్లా వ్యాధినివారణ టీకాల అధికారి , డాక్టర్ హేమంత్ , జిల్లా రెవిన్యూ అధికారి మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు .
