బేగంపేట నవంబర్ 18(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలోవైద్య,కుటుంబ,సంక్షేమ విజ్ఞాన సాంకేతిక శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ మంగళ వారం దర్శించుకుని పూజలు నిర్వహించారు.మంత్రికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,శ్రీ భూలక్ష్మీ దేవాలయ నిర్మాణ దాత విశాల్ సుధాం మంత్రిని సాంప్రదాయ బద్దంగా తోడ్కొని వెళ్ళి పూజలు నిర్వహింప జేశారు.ఘనంగా సత్కరించారు.పూజల అనంతరం మంత్రి భక్తులు,స్థానికులతో మాట్లాడారు.ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు.దేవాలయ అభివృద్ధికోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని విశాల్ సుధాం కు ,కాలనీ వాసులకు సూచించారు.దేవాలయ పునర్ నిర్మాణం ,,అభి వృద్ధి ఖర్చును తెలంగాణా ప్రభుత్వం భరిస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ వారికి హామీ ఇచ్చారు.దీని ద్వారా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింతగా అభివృద్ధి చేయడమేనని మంత్రి తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో భక్తులు వి.చంద్ర మోహన్,జే.శేఖర్,వెంకటరావు.ఎం.కృష్ణ,అరుణ్ గౌడ్ ,బాల,దేవాలయ ప్రధాన అర్చకులు మఠం సదాశివుడు తదితరులు పాల్గొన్నారు.



