స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగముగా పెండింగ్లో ఉన్న క్లెయిమ్ ఫారం 6,7,8 లు వారం రోజులలో ఎంక్వయిరీలు పూర్తిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హల్లో ఒంగోలు నియోజక వర్గానికి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంబంధించి సూపర్వైజర్లు, బిఎల్ఓ లతో జరిగిన సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు పాల్గొని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంబంధించి పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా 2002 సంవత్సరము యొక్క ఓటరు లిస్టు లోని పేర్లు మరియు ప్రస్తుతం 2025 సంవత్సరము యొక్క ఓటరు లిస్టు లోని పేరులకు మ్యాప్పింగ్ ప్రక్రియ చేయాలన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న క్లెయిమ్ ఫారం 6,7,8 లు వారం రోజులలో ఎంక్వయిరీలు పూర్తిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఈఆర్ఓ , ఒంగోలు ఆర్డిఓ లక్ష్మి ప్రసన్న, ఒంగోలు, కొత్తపట్నం తహసిల్దార్ లు మధుసూధన రావు, శాంతి, ఎఈఆర్ఓ లు రామానాయుడు, సలోమి, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రావు, బాబురావు, సుధాకర్ రావు, సూపర్వైజర్లు, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
