ఆధ్యయన సందర్శన కార్యక్రమంలో భాగంగా గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటు కమిటీ చైర్మన్ మరియు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్ది మంగళవారం
కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో కమిటీ సభ్యులతో కలసి గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాలకు సంబందించిన పలు కేంద్ర పధకాల అమలుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కేంద్ర పాలిత ప్రాంత లక్షద్వీప్ ప్రభుత్వం, రాష్ట్ర గృహ , పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్ధికశాఖ మంత్రిత్వ, కవరట్టి స్మార్ట్ సిటీ, హడ్కో, యన్.బి.సి.సి., కెనరా బ్యాంకు, తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాలకు సంబందించి స్వచ్చ్ భారత్ మిషన్ , అర్బన్, అమృత్, పి.యం.ఆవాస్. యోజన, పి.యం.ఎస్.వి.ఏ.నిధి పధకాలు మరియు కార్యక్రమాల పనితీరు - పురోగతి, కవరట్టి స్మార్ట్ సిటీలోని ఐ.సి.సి.సి.–ఎస్.పి.వి. నిర్వహణ మరియు హడ్కో - యన్.బి.సి.సి. పనితీరుపై చర్చలు జరిపారు.
ఈ చర్చలలో ప్రతినిధులు కోరిన సదుపాయాలు మరియు చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వానికి శిఫార్సు చేస్తానని వారికి మాగుంట శ్రీనివాసులురెడ్ది గారు తెలియజేశారు.

