19 న అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులు – రెండవ విడుత నిధులు విడుదల – పీఎం కిసాన్ లో 2,31,383 మందికి 46.28 కోట్లు, అన్నదాత సుఖీభవలో 2,68,165 మంది రైతులకు 134.08 కోట్లు లబ్ధి మొత్తం – 180.36 కోట్ల మేర జిల్లా రైతులకు లబ్ది

రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు బుధవారం అన్నదాతలకు అందనున్నాయి. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒక్కోక్క రైతుకు మూడు విడుతలుగా రూ.6వేలల చొప్పున, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో సంవత్సరానికి రూ. 14వేల చొప్పున మూడు విడుతలలో అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడేళ్లుగా ఈ పధకాన్ని అమలు చేస్తుండగా, గత ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పేరుతో అందించగా అదే పథకాన్ని పేరు. మార్పుతో అన్నదాత సుఖీభవ అంటూ రూ.14వేల చొప్పున ఇవ్వటానికి శ్రీకారం చుట్టారు. అందులో మొదటగా దఫా ఆగష్టు 2న ఇవ్వగా, ప్రస్తుతం రెండవ దఫా ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఒక్కోక్క రైతుకు సంవత్సరానికి రూ.20వేల వరకు లబ్దిచేకూర నుంది. పీఎం నరేంద్ర మోదీ ఈ పధకాన్ని బుధవారం తమిళ నాడులోని కోయంబత్తూరు నుండి ప్రారంభించనుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా కమలాపురం నుండి ప్రారంభించటానికి శ్రీకారం చుట్టారు. అదే నమయంలో రాష్ట్రంలోని పంచాయితీ పరిధిలోని రైతు సేవా కేంద్రాలలో లబ్దిదారులతో సమావేశం నిర్వహించి రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రొత్సాహం, పథకం వివరాలు తెలిపాలని, సీఎం ప్రత్యేక్ష ప్రసారం ప్రతి రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చెయ్యాలని వ్యవసాయాశాఖ కమీషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. పీఎం కిసాన్. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులలో ఎంపిక నిబంధనలలోరి తేడాల వల్ల, సాంకేతిక లోపాల వలన లబ్దిదారుల సంఖ్య కొంత వ్యత్యాసం ఉన్నది. జిల్లాలో పీఎం కిసాన్ పధక లబ్ధిదారులు 2,31,383 మందికి రూ. 46,27,66,000లు అందనున్నాయి. అందులో దర్శి నియోజక వర్గ పరిధిలో 35977 మంది రైతులకు రూ.7, 19,54000లు, గిద్దలూరు నియోజక వర్గ పరిధిలోని 32762 మంది రైతులకు రూ.6,55,24,000 లు, కనిగిరి నియోజక వర్గంలోని 36,339 మంది రైతులకు రూ.7.26,78,000, కొండెపి నియోజక వర్గ రైతులు 31,568మంది కి 6,31,36000 , మార్కాపురం నియోజకవర్గ రైతులు 29,070 మందికి 5,81,40,000లు ,
ఒంగోలు నియోజక వర్గ రైతులు 7577 మంది కి రూ. 1,51,54,000, నంతనూతలపాడు నియోజక వర్గ రైతులు 24,826 మందికి రూ. 4,96,52,000లు, యర్ర గొండ పాలెం నియోజక వర్గ రైతులు 33,264 మందికి రూ. 6,65,28,000 అందనున్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 2,68,165 మందికి ఒక్కోక్కరికి ఈ దఫా 5వేలు చొప్పున 134 కోట్ల మేర అందనున్నాయి. పీఎం కిసాన్ లో 2,31,383 మందికి 46.28 కోట్లు, అన్నదాత సుఖీభవలో 2,68,165 మంది రైతులకు 134.08 కోట్లతో కలిపి 180.36 కోట్ల మేర జిల్లా రైతులకు లబ్ధి చేకూరనున్నది.

180.36 కోట్ల మేర జిల్లా రైతులకు లబ్ధి – ఎన్ శ్రీనివాస రావు, జిల్లా వ్యవసాయాధికారి, ఒంగోలు

పీఎం కిసాన్ లో 2,31,383 మంది రైతులకు 46.28 కోట్లు, అన్నదాత సుఖీభవలో 2,68,165 మంది రైతులకు 134.08 కోట్లు మొత్తం 180.36 కోట్ల మేర జిల్లా రైతులకు లబ్ధి చేకూర నున్నది. రబీ సాగుకు ఈ పెట్టుబడి సాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. జిల్లాలో ప్రతి రైతు సేవా కేంద్రంలో రైతులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వం చేస్తున్న మేలును రైతులకు వివరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *