మాజీ ప్రధాన మంత్రిఉక్కు మహిళ ఇందిరా గాంధీ 108వ జయంతి కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. యర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాలపర్తి విజేష్ రాజ్ మాట్లాడుతూ బ్యాంకుల జాతీయకరణ ద్వార ప్రతి పేదవాడికి బ్యాంకు సౌకర్యాలు, బ్యాంకులలో అన్ని కులాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. అమెరికా లాంటి అగ్రదేశాల బెదిరింపులకు భయపడకుండా 1975 యుద్ధం ద్వారా పాకిస్తాను రెండు ముక్కలుగా విడగొట్టిన ఘనత ఇందిరా గాంధీ సొంతం అని కొనియాడారు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గోరంట్ల కోటేశ్వర రావు, షేక్ రసూల్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరిగినేని వెంకట నరసయ్య, రాష్ట్ర కేకేసి ప్రధాన కార్యదర్శి సుధీర్ వర్మ, జిల్లా పార్టీ కంట్రోల్ రూమ్ సభ్యులు కందుల కృష్ణ బాబు, జిల్లా పార్టీ కార్యదర్శి మీజూరి జాకబ్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
