ప్రకాశం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీలలో శనివారం గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీకి సంబంధించిన సేవలను గ్రామస్థాయిలోనే అందించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్యసంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జోషఫ్ కుమార్ తెలిపారు. గ్రామ సభల నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ సభలలో కొత్త జాబ్ కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణ, పనికోసం దరఖాస్తుల నమోదు, ఈ – కెవైసీ కారణంగా డిలీట్ అయిన జాబ్ కార్డుల రెక్టిఫికేషన్ , అర్హలైన వారు ఉంటే వెంటనే పునరుద్ధరణ చేయటం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ఉపాధి హమీ పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రతి అర్హడిని చేరవేటమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
22న ప్రకాశంజిల్లా వ్వాప్తంగా ఉపాధి పనుల గుర్తింపుకు గ్రామ సభలు
19
Nov