ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు అందించే మూడు చక్రాల మోటార్ వాహనాల దరఖాస్తు లోని ఎల్ ఎల్ ఆర్ ప్రక్రియ సులభ తరం చేసేందుకు స్పందన హాల్ శుక్రవారం ఉదయం విభిన్న ప్రతిభావంతుల వయో వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక లెర్నింగ్ లైసెన్స్ శిబిరం నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభా వంతుల శాఖ జెడీ సువార్త తెలిపారు. జాయింట్ కలెక్టర్, ఎపీ విభిన్న ప్రతిభావంతుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేశాలతో జిల్లా ప్రాంతీయ రవాణాశాఖాధికారి వారి సమన్వయంతో ఎల్ ఎల్ ఆర్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎల్ ఎల్ ఆర్ కోసం అర్హలైన దివ్యాంగులు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల కలిగి 70శాతం పైగా అంకవైకల్యం కలిగి ఉండి 10వ తరగతి ఉత్తీర్ణులు అయిన అర్హలని తెలిపారు. వారు ఆధార్, సదరం సర్టిఫికేట్ తో పాటు, రెండు పాస్ పుటోలు తీసుకుని శిబిరానికి హాజరు కావాలని జిల్లా విభిన్న ప్రతిభా వంతుల శాఖ జెడీ సువార్త తెలిపారు.
దివ్యాంగులకు ప్రత్యేక లెర్నింగ్ లైసెన్స్ శిబిరం
19
Nov