పశుపోషకులు వాటిపోషణకు బీరు పొట్టు, లిక్విడ్ ద్రవం ఉపయోగించటం వలన తీవ్ర అనర్థాలు ఉంటాయని జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి వెంకటేశ్వర రావు తెలిపారు. తాళ్లూరు మండలంలోని పలు పశువుల షేడ్ ల ను ఆయన బుధవారం పరిశీలించారు. అధికంగా బీరు, లిక్విడ్ ఉపయోగించటం వలన వాటి జీవిత కాలంతో పాటు, పునరుత్పత్తి శక్తి తగ్గిపోయి రైతులు తర్వాత నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు. పశువైద్యశాలలో రికార్డులను పరిశీలించారు. నబ్సిడీ పై అందిస్తున్న దాణాను, గడ్డిజొన్న, పెయ్యదూడల సెమెన్లను ఉపయోగించుకోవాలని కోరారు. గోకుల షేడ్స్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో తాళ్లూరు, తూర్పుగంగవరం పశువైద్యులు డాక్టర్ ప్రతాప్ రెడ్డి, డాక్టర్ వంశీలు, సిబ్బంది పాల్గొన్నారు.

