బేగంపేట నవంబర్ 20(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్ లకు చెందిన 15 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 7.57 లక్షల రూపాయల విలువైన ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆనారోగ్యం బారినపడి చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు. పలు ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఆర్ధిక ఇబ్బందుల కారణంగా మెరుగైన వైద్యం పొందలేకపోతున్నారని, నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో మెరుగైన వైద్యం అందించాలనీపిలుపునిచ్చారు. వైద్య చికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు నాగులు, టి.శ్రీహరి, కొండాపురం మహేష్ యాదవ్, లక్ష్మీపతి, శేఖర్, ప్రేమ్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
