బేగంపేట నవంబర్ 20
(జే ఎస్ డి ఎం న్యూస్) :
కార్తీక మాసం చివరి రోజు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళీ అమ్మవారి ఆలయం తో పాటు ఆలయంలోని శ్రీ వీరభద్ర స్వామి సహిత శ్రీ మహాకాళేశ్వర స్వామి కి 108లీటర్ల పాలు,పండ్లతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.అమావాస్య సందర్భంగా అమ్మ వారి దేవస్థానంలో రుద్రహోమం నిర్వహించారు. ఈ పూజలు,హోమంలో పాల్గొనేందుకు జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలి వచ్చి పూజలు చేశారు.రుద్రహోమం,పాలు,
పండ్లతో చేసిన అభిషేకం కార్యక్రమంలో లో ఆలయ ఈ ఓ గుత్తా మనోహర్ రెడ్డి దంపతులు పాల్గొని పూజలు చేశారు.కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఈ ఓ గుత్తా మనోహర్ రెడ్డి,ఫౌండర్ ప్యామిలీ మెంబెర్స్ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.పూజలలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ గావించారు.సాయంత్రం సమయంలో ఆలయ ప్రాంగణం లో భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించ నున్నారు.


