ఒంగోలుకు చెందిన 5వ తరగతి విద్యార్థి మహామ్మద్ ఫర్హాన్ వినికిడిలోపంతో బాధపడుతూ ఎన్-7 స్పీచ్ ప్రాసెసర్ మంజూరు చెయ్యాలని తల్లి సబిహా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ రాజా బాబును కలిసి విన్నవించారు. వారి అభ్యర్థనకు స్పందించి ఎంపీ వారి నిథుల రూ. 4,05,400లు ఎంపీ ల్యాండ్ నుండి మంజూరు చేసారు. దీంతో ఎస్ -7 స్పీచ్ ప్రొసెసర్ ను కొనుగోలు చేసి గురువారం జిల్లా విభిన్న ప్రతిభా వంతుల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ జెడీ సిహెచ్ సువార్త తో కలసి జిల్లా కలెక్టర్ రాజా బాబు ను లబ్ధిదారుడు మహామ్మద్ ఫర్హాన్, తల్లి సబిహాలు కలిసారు. ఈ సందర్భంగా విద్యార్ధికి ఎస్ -7 స్పీచ్ ప్రొసెసర్ అందించారు. పనితీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అమూల్యమైన సహాయం అందించినందుకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, జిల్లా కలెక్టర్ రాజా బాబుకు విద్యార్థి, తల్లి కృతజ్ఞతలు తెలిపారు.
