విద్యార్థులు పఠనాశక్తి
పెంచుకొని జ్ఞానాన్ని పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు.
జిల్లా కేంద్ర గ్రంథాలయ 58వ జాతీయ గ్రంధాలయ వార్షికోత్సవ వేడుకలు గురువారం
ముగింపు వేడుకల సందర్భంగా ముఖ్యఅతిథిగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ రోణంకి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చినిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం తెలిపిన విషయాన్ని విద్యార్థులకు గుర్తు చేశారు. అనగా పుస్తకం జ్ఞానాన్ని పెంపొందిస్తుందని,
వారంలో ఒక్కరోజు అయినా గ్రంథాలయాన్ని సందర్శించి మీరు ఏదో ఒక ఆక్టివిటీని అలవర్చుకొవలని, పేపర్ చదవడం డ్రాయింగ్ వేయడం మొదలగునవి ఆక్టివిటీలో పాల్గొని మీ జ్ఞానాన్ని పెంపొందించుకొనవల్సిందిగా సూచించారు. సెల్ ఫోన్ కు దూరంగా ఉండి వార్తాపత్రికలను పుస్తకాలను చదవడం అలాగే మీ కలలను డెవలప్ చేసు కోవాలని, మీకు నచ్చిన కలలు సంగీతము నృత్యము డ్రాయింగ్ పెయింటింగ్ మొదలగునవి డెవలప్ చేసుకుని ఒక్క చదువుకే ప్రాధాన్యత ఇవ్వకుండా కలలను కూడా ప్రోత్సహిస్తూ ముందుకు సాగి మీ గమ్యాన్ని మీరు చేరుకోవాల్సిందిగా సూచించారు. వారం రోజులపాటు జరిగినటువంటి పోటీలలో పాల్గొని విజేతలుగా పొందిన విద్యార్థులకు బహుమతలు అందించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి జీవి శివారెడ్డి గారు, ఇన్చార్జి డిప్యూటీ లైబ్రేరియన్ కె సంపూర్ణమ్మ , సందీప్ అనిల్ ,శివకుమారి, గోవిందమ్మ మరియు కార్యాలయ సిబ్బంది సాంసన్, కృష్ణవేణి ,మృదుల్ కుమార్ మరియు గ్రంథాలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

