బేగంపేట నవంబర్ 21
(జే ఎస్ డి ఎం న్యూస్) :సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళీ అమ్మ వారిని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ శుక్రవారం దర్శించుకున్నారు. అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన సాయి కిరణ్ యాదవ్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
