స్వచ్చతకు పరిశభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డిజీఓ, జీఎస్ డబ్ల్యు అధికారి
సువార్త కోరారు. మండలంలోని మాధవరం గ్రామంలో శుక్రవారం పూర్తి పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని అన్ని పంచాయితీల నుండి వచ్చిన క్లాప్ మిత్రల సహకారంతో గ్రామంలో ప్రతి వీధిలో, ప్రతి కాలనీలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించి ఎంపీడీఓ అజితతో కలసి ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. విద్యార్థులతో ముచ్చటించారు. పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత వలన రోగాలు దరిచేరవని చెప్పారు. రోడ్ల వెంబడి, పబ్లిక్ ప్రదేశాలలో పేడ దిబ్బలు వేసిన వారికి వాటిని తొలగించాలని సూచించారు. లేనట్లయితే నోటీనులు ఇచ్చి జరిమాన విధిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డీజీఓ, జీ ఎస్ డబ్యు అధికారి సువార్త మాట్లాడుతూ క్లాప్ మిత్రలు, కమ్యూనిటి రిసోర్స్ పర్సన్స్‌తో మాట్లాడుతూ ప్రతి రోజు గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాల్సిన విధానాన్ని, ప్రజలను చైతన్య పరచాల్సిన వైనాన్ని వివరించారు. ఎంపీడీఓ అజిత మాట్లాడుతూ మండలంలో గ్రామ కార్యదర్శులు, నచివాలయ సిబ్బంది కొరత అధికంగా ఉందని అందువలన పని కొంత మేర లేటు అవుతున్నట్లు తెలిపారు. నర్పంచి తాటికొండ రేణుక, డిప్యూటీ ఎంపీడీఓ నాగ మల్లేశ్వరి, సెక్రటరీ షహనాజ్ బేగం మాజీ నర్పంచి దాను, నాయకులు సోము శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




