స్వాంత్య్ర సమరయోధుని తనయుడు, మాజీ నర్పంచి ఇడమకంటి పెద్ది రెడ్డికి శనివారం గ్రామ ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. పెద్దిరెడ్డి కుమారుడు లక్ష్మి రెడ్డి అంతియ యాత్రలో సాంప్రదాయ పద్దతిలో ముందుకు సాగగా ఆయన వెంట గ్రామస్తులు, బంధువులు అధిక సంఖ్యలో వెళ్లి తుది వీడ్కోలు చెప్పారు. దర్శి ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి హైదరాబాదు నుండి లక్ష్మి రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఫోన్ లో లక్ష్మిరెడ్డిని పరామర్శించారు.
జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, నాయకులు ఇడమకంటి వెంకట రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూధన రెడ్డి, గోళ్ల పాటి మోషే, మాజీ జెడ్పీటీసీ ఎల్ జీ వెంకటేశ్వర రెడ్ది, పార్టీ అధ్యక్షుడు టీవీ నుబ్బా రెడ్డి, నర్పంచి మేకల చార్లేన్ సర్జన్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గుజ్జుల యోగి రెడ్డి, కోట క్రిష్ణా రెడ్డి, కోట మన్నే రెడ్డి, శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త కృష్ణారెడ్డి, తాళ్లూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరబ్రహ్మం, సరస్వతీ విద్యాసంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, పలు గ్రామాల సర్పంచిలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచిలు, మాజీ ఎంపీటీసీలు పాల్గొని ఆయన బౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

