ఉపరవాణా కమీషనర్ ఆర్ సుశీల ఆధ్వర్యంలో శనివారం దివ్యాంగులకు ఎల్ ఎల్ ఆర్ స్లాట్ మేళా ను నిర్వహించారు. 57 మంది శుక్రవారం స్పందన హాల్లో జరిగిన మేళాలో దరఖాస్తు చేసుకోగా వారికి శనివారం ఎల్ ఎల్ ఆర్ పరీక్ష నిర్వహించారు. 57 మందికి ఎల్ ఎల్ ఆర్ లు అందించారు. కార్యక్రమంలో ఉపరవాణా కమీషనర్ ఆర్ సుశీల, దివ్యాంగుల సంక్షేమశాఖాధికారి సువార్త తదితరులు పాల్గొన్నారు.


