సంతోష్ నగర్ లో తిరుమల కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సేవలు ప్రారంభం…….బ్యాంక్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామీజీ,తెలంగాణా హైకోర్టు జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి.సినీ నటులు సుమన్, తదితరులు.

హైదరాబాద్ నవంబర్ 23
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఖాతాదారుల కు సేవలు అందించడం కోసం తిరుమల కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మూడవ శాఖను ఆదివారం సంతోష్ నగర్ లో ప్రారంభించింది.ఈ శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామీజీ ,హైకోర్టు జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ,సినీ నటులు సుమన్ ,ఐ ఎఫ్ ఎస్ రిటైర్డ్ అధికారి మల్లిఖార్జున రావులుపాల్గొన్నారు.తిరుమల కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ను హైదరాబాద్ మలక్ పేట్ లో ప్రధాన కార్యాలయాన్ని 1998 సెప్టెంబర్ 23 న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ మాజీ గవర్నర్ డాక్టర్ రంగరాజన్ చేతుల మీదుగా ప్రారంభించబడింది.తిరుమల బ్యాంక్ సంస్థాపకులుగా నంగునూరి చంద్రశేఖర్, ప్రముఖ చలనచిత్ర నటులు కీర్తిశేషులు అక్కినేని నాగేశ్వరావు , ప్రముఖ పారిశ్రామికవేత మై హోమ్ రామేశ్వరావు ఈ బ్యాంకుకు దార్శనికులుగాఉన్నారు.తిరుమల బ్యాంకు ను స్థాపించి ఇప్పటివరకు 27 సంవత్సరాలువిజయవంతంగా పూర్తి చేసుకొని 28 వ సంవత్సరంలో అడుగుపెట్టింది.
తిరుమల బ్యాంక్ ప్రారంభించినప్పటి నుండి అచంచలమైన నిబద్ధత తో పని చేస్తుంది.ఖాతాదారుల ఉన్నత ప్రమాణలను స్థిరంగా కలిగి ఉండడం మరియు సాధారణ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడం తిరుమల బ్యాంక్ ముఖ్య ఉద్దేశం.ఈ బ్యాంకు గర్వకారణం ఏంటి అంటే వాటాదారులకు రివార్డులు అందిస్తుంది. వాటాదారులకు 12 శాతం నిరంతర డివిడెంట్ లతో బలమైన ఆర్థిక నాయకత్వాన్నిప్రతిబింబిస్తుంది
తిరుమల బ్యాంక్ సుమారుగా ఇప్పటివరకు 75 కోట్ల బిజినెస్ తో ఖాతాదారులకు మద్దతుగా నిలబడుతుంది .మధ్యతరగతి దిగువ తరగతి ఖాతాదారుల కోసం ఎప్పటికప్పుడు అడ్వాన్స్ స్కీమ్ ల తో వారి ముందు నిలబడింది. తిరుమల బ్యాంకు ఎటిఎం అందించడం ద్వారా డిజిటల్ సేవలు , ఈ కామర్స్, పి ఓ ఎస్ లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్ మరియు యూపీఏ సేవలు , గోగుల్ పే ఫోన్ పే వంటి సౌకర్యాలు కల్పిస్తుంది.తిరుమల బ్యాంక్ ఖాతాదారులకు చేస్తున్న సేవలను గుర్తించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడవ శాఖకు అనుమతి ఇచ్చింది. రాబోయే కాలంలో జంట నగరాలలో మరో రెండు శాఖలతో ఖాతాదారుల ముందుకి వస్తానని చైర్మన్ నంగునూరు చంద్రశేఖర్ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *