ఒంగోలు నగరం బాగా అభివృద్ధి చెందుతుంది. వైద్య రంగంలో సూపర్ స్పేషాలిటి వైద్యశాలలు రావటం అభినందనీయమని మంత్రి డోలా బాల వీరాంజనీయ స్వామి అన్నారు. ఎంకె ఆర్ వైద్యశాల నూతన భవన ప్రారంబోత్సవ కార్యక్రమంలో నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ నూతన వైద్యశాలను అభివృద్ధి చేయటం అభినందనీయమని అన్నారు. రాబోవు రోజులలో మరింత అభివృద్ధి చెందాలని కోరారు. ఒంగోలు, కనిగిరి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్థన్ రావు, డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మేయర్ గంగాడ సుజాత, డాక్టర్ మాలకొండా రెడ్డి, డాక్టర్ చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

