బేగంపేట నవంబర్ 23
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట డివిజన్ పరిధిలోనీ బ్రాహ్మణవాడి బస్తీ నుంచి పెద్ద సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన మహిళలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధాం నేతృత్వంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సీ.రాజేందర్ అధ్యక్షతన మహిళా నాయకురాలు మూల సువర్ణ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.వారికి పి సి సి ఉపాధ్యక్షురాలు,సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా.కోట నీలిమ వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బి ఆర్ ఎస్ , బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరుతున్నారని అన్నారు.ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుందని, ఇది చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు లేనిపోని కుంటి సాకులు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బూటకపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు చెప్పిన హామీల ప్రకారం ఆరు గ్యారెంటీ లను క్రమబద్ధంగా అమలు చేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు.
మరోవైపు పార్టీలో చేరిన మహిళలు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వంచేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాల్ సూదం, రాజేందర్ ముదిరాజ్, చిరంజీవి, నసీర్ అడ్డు,కృష్ణ సువర్ణ, మాధవి, శ్యామల, పద్మ, గీత, గౌరి, రామ కౌసల్య, నిర్మల, భారతి, బసవమ్మ, నాగలక్ష్మి, సునీత, సురేఖ, శోభ, సరస్వతి, శివలీల, రజియా, అఖిల, నస్రీన్, గౌశిక బేగం, మమతా రాణి, అనురాధ, నీలవేణి, లక్ష్మి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

