రాంగోపాల్ పేట ,నవంబర్ 23(జే ఎస్ డి ఎం న్యూస్) :
అప్సా స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో సర్వ్ నీడీ సంస్థ సహకారంతో రాంగోపాల్ పేట డివిజన్‌లోని యూత్ హాస్టల్ ప్రాంగణంలో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అప్సా సంస్థ పనిచేస్తున్న 30 బస్తీల నుండి వచ్చిన బాల బాలికలు ఈ వేడుకలో పాల్గొన్నారు. పిల్లలకు ఆటలు, పాటలు, నృత్య ప్రదర్శనలు వంటి వినోదాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వేడుకను మరింత అందంగా తీర్చిదిద్దారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్ వ్యవస్థాపకుడు వేదకుమార్ మాట్లాడుతూ, అప్స్ వంటి స్వచ్చంద సంస్థలు వివిధ బస్తీలలోని పిల్లలను ఒక్క వేదికపైకి తీసుకువచ్చి, వారి హక్కులపై అవగాహన కల్పిస్తూ, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందిస్తూ ప్రపంచ బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు.అనంతరం సర్వ్ నీడీ స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ,ప్రతి ఒక్కరు చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాల్లోపాలుపంచుకోవాలి అన్నారు. తమ అన్నదాత ప్రాజెక్ట్ ద్వారా ప్రతిరోజూ 2,000 మంది అనాథలు మరియు నిరుపేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నాం. అదేవిధంగా వృద్ధ నిరాశ్రయులకు రగ్గులు, స్కార్ఫ్‌లు పంపిణీ చేయడంతో పాటు వారికి ఉచిత ఆశ్రయం మరియు భోజనం అందిస్తున్నాం. తల్లిదండ్రులు లేని చిన్నారులకు ఆశ్రయం మాత్రమే కాకుండా విద్య, వైద్య సేవలను కూడా అందిస్తున్నాం” అని వివరించారు.అప్సా సీనియర్ కోఆర్డినేటర్ బొట్టు రమేష్ బస్వారాజ్ మాట్లాడుతూ,ప్రతి విద్యార్థి తన హక్కులను తెలుసుకుని వాటి సాధనకు కృషి చేయాలి. ముందున్న తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు.
చంద్రయ్య విద్యార్థులకు ఈజీ మేత్స్‌పై అవగాహన కల్పిస్తూ సులభ పద్ధతుల్లో గణితం నేర్పారు.ఈ కార్యక్రమంలో అప్సా సామాజిక కార్యకర్తలు గాజుల మంజుల, రాజేశ్వరి, శోభా, శ్రావణి, మల్లికా, ఇందిరా, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
వివిధ బస్తీల నుండి వచ్చిన సుమారు 200 మంది విద్యార్థులకు సర్వ్ నీడీ సంస్థ ఉచితంగా భోజనం అందించింది.


