ప్రజల సమస్యల పరిష్కారంకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో వచ్చిన అర్జీలను సకాలంలో, గడువులోగా నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు
అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా రెవెన్యు అధికారి శ్రీ చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కుమార్, జాన్సన్, విజయజ్యోతి, కళావతి లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజల సమస్యల పరిష్కారంకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో వచ్చిన అర్జీలను సకాలంలో, గడువులోగా నాణ్యతతో పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా పలువురు అర్జీ దారులతో మాట్లాడి అర్జీ పరిష్కారం విధానం గురించి వారి స్పందన తెలుసుకోవడం జరుగుచున్నదన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలను నిర్ణీత గడువు లోపు చిత్తశుద్ధితో పరిష్కరించడంతో పాటు దరఖాస్తులు మరల రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ప్రతి కార్యాలయంలో ఒక నోడల్ అధికారిని నియమించడం జరిగిందని, సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించడమే కాక, వారి సమస్యను సావధానంగా విని నిబంధనల మేరకు సానుకూల విధానంలో పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. సమస్య పరిష్కారం అయిన తరవాత పరిష్కార విధానం, దరఖాస్తుదారుల సంతృప్తి చెందారా.. లేదా అన్న విషయాన్నీ అధికారులు స్వయంగా ఫోన్ చేసి తెలుసుకోవాలని, అప్పుడే ప్రభుత్వ సేవలపై ప్రజలకు అనుకూల అభిప్రాయం ఏర్పడుతుందన్నారు. అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

