ఏఐ ఆధారిత ముంద‌స్తు హెచ్చ‌రిక వ్య‌వ‌స్థ‌తో రోగులకు మరింత భ‌ద్ర‌త‌.కిమ్స్ ఆస్ప‌త్రిలో స‌రికొత్త టెక్నాల‌జీ ఆవిష్క‌ర‌ణ‌.

హైద‌రాబాద్‌, 25 న‌వంబ‌ర్, (జే ఎస్ డి ఎం న్యూస్ ) :
దేశంలోనే ప్ర‌ముఖ ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన కిమ్స్ ఆస్ప‌త్రి ఏఐ ఆధారిత ముంద‌స్తు హెచ్చ‌రిక వ్య‌వస్థ‌ను ఆవిష్క‌రించింది. దీనివ‌ల్ల ప్ర‌ధానంగా ఇన్‌పేషెంట్లు చికిత్స‌ల‌కు ఎలా స్పందిస్తున్నారో అన్న విష‌యం తెలియ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క పేషెంట్ భ‌ద్ర‌త గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. రోగుల విష‌యంలో అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం ఎప్ప‌టిక‌ప్పుడు తీసుకురావ‌డంలో ఆస్ప‌త్రి నిరంత‌ర నిబ‌ద్ధ‌తకు ఈ చొర‌వ నిద‌ర్శ‌నం. ఈ స‌రికొత్త వ్య‌వ‌స్థ‌తో రోగుల కీల‌క పారామీట‌ర్లు అన్నింటినీ నిరంత‌రం రిమోట్‌గానే ప‌ర్య‌వేక్షించేందుకు వీలుంటుంది. ఇందుకు వైర్‌లెస్ వేర‌బుల్ ప‌రిక‌రాల‌ను ఉప‌యోగిస్తారు. రోగుల ప‌రిస్థితి ఏమైనా మార‌గానే వెంట‌నే క్లినిక‌ల్ బృందాల‌కు రియ‌ల్ టైంలో ఎల‌ర్టులు వెళ్తాయి. వారు త‌క్ష‌ణం ప‌రిస్థితిని న‌ర్సింగ్, మెడిక‌ల్ సిబ్బందికి తెలియ‌జేసి పూర్తి స‌మ‌న్వ‌యంతో వెంటనే త‌గిన చికిత్స అందిస్తారు. దీనివ‌ల్ల రోగుల సేఫ్టీ ప్రొటోకాల్ మ‌రింత ప‌టిష్ఠం అవుతుంది. ఎవ‌రైనా రోగుల ప‌రిస్థితి క్షీణిస్తుంటే అది మొద‌లైనవెంట‌నేగుర్తించేందుకు వీలుంటుంది, ప‌రిస్థితి మ‌రింత విష‌మించ‌కుండా కాపాడ‌గ‌ల‌రు. ఈ సరికొత్త వ్య‌వ‌స్థ గురించి *కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండి డా. భాస్కర్ రావు మాట్లాడుతూ ఎప్ప‌టిక‌ప్పుడు అత్యాధునిక వైద్య టెక్నాల‌జీల‌ను అందిపుచ్చుకోవ‌డంలో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్ప‌త్రికి బ‌ల‌మైన రికార్డు ఉంది. వీటిలో ఆగ్మెంట్ రియాలిటీ అసిస్టెడ్ న్యూరోస‌ర్జ‌రీ, అత్యాధునిక ఇమేజింగ్ సిస్టంలు, ఏఐ ఆధారిత డ‌యాగ్న‌స్టిక్స్, రోగుల అనుభ‌వాల‌ను పెంచే డిజిట‌ల్ ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. ఇప్పుడు ఏఐ ఆధారిత ప‌ర్య‌వేక్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను కూడా చేర్చ‌డంతో రోగుల ప‌రిస్థితిని నిరంత‌రం గ‌మ‌నించ‌డానికి, రోగి బెడ్ వ‌ద్దే స‌రైననిర్ణ‌యాలుతీసుకోవ‌డానికి వీల‌వుతుంది. త‌మ రోజువారీ క్లినిక‌ల్ ఆప‌రేష‌న్ల‌కు ఏఐ ఆధారిత ముంద‌స్తు హెచ్చ‌రిక‌ల వ్య‌వ‌స్థ‌లను లైఫ్‌సైన్స్ వారి ఇంటెలిజెంట్ మానిటరింగ్ టెక్నాల‌జీ ద్వారా చేర్చి, కిమ్స్ ఆస్ప‌త్రి వైద్య వ్య‌వ‌స్థ‌లో త‌న స్థానాన్ని మరింత బ‌లోపేతం చేసుకుంది. ప్ర‌ధానంగా రోగి భ‌ద్ర‌త‌, చిక‌త్స‌ల్లో స‌మ‌ర్థ‌త‌, రోగుల అనుభ‌వాల విష‌యంలో గ‌ణ‌నీయ‌మైన మెరుగుద‌ల సాధిస్తోందన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *