ప్రతి వ్యక్తి జీవితంతో సంతో షాన్ని కల్గిస్తూ, సమాధన పరుస్తూ, భయాన్ని పోగోట్టే నామస్మరణ జీసస్ అని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. తాళ్లూరు మండలంలోని రమణాలవారిపాలెం ఎస్సీ కాలనీలో మంగళవారం టిడిపి నాయకుడు జి చిన కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సెమీక్రిస్మస్ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్ సాగర్ లు హాజరై సెమీక్రిస్మస్ కేక్ కట్ చేసి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో
రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ పెదకాలేషావలి ( బడే), రాష్ట్ర నాటక రంగ అకాడమీ డైరెక్టర్ బి.ఓబుల్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఐడమ కంటి ఐ.వెంకటేశ్వరరెడ్డి, మన్నేపల్లి సొసైటీ చైర్మన్ గొంది రమణారెడ్డి ( సమర), రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శిగొళ్లపూడి వేణుబాబు,టిడిపి యువ నాయకుడు విద్యాసాగర్, తాతయ్య, స్వామిదాసు, పాలె పోగురాజు, తదితరులు పాల్గొన్నారు.





