డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా రూపోందించిన రాజ్యాంగం దేశ ప్రజ లకు అత్యుత్తమ చట్టమని ఎంఈవో జి. సుబ్బయ్య, ఎంపీడీవో పి.అజితలుతెలి పారు. 76వభారతరాజ్యాంగ ఆమోదదినోత్సవాన్ని ఎంపీడీవో కార్యాలయం వద్ద బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాజ్యాంగం రూపొం దించే కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ ప్రపంచదేశాలు తిరిగి ప్రపంచం లోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ఈ రాజ్యాంగం వల్ల భారతం లోనివశించే అన్ని వర్గాల ప్రజల అభ్యున్న తికి గొప్పచట్టాలు రూపొందించా న్నారు.దేశ ప్రజలు భారత రాజ్యాంగాన్ని అనుసరిం చిజీవనం సాగిస్తున్నారన్నారు. భవిష్యత్తులో కూడా అందరూరాజ్యాంగానికి కట్టు బడి వుండాలనితెలిపారు. ముం దుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాలులు అర్పించారు. రాజ్యాంగానికి కట్టుబడి వుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈకార్యక్రమంలో
జడ్పీటీసీ మారంవెంకటరెడ్డి, మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు, టీడీపీ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు అనపర్తి సుబ్బారావు, టీడీపీ గ్రామ అధ్యక్షులుమారం వెంకటరెడ్డి, సచివాలయ సిబ్బందితదితరులుపాల్గొన్నారు.
అంబేద్కర్ నగర్ లో….
అంబేద్కర్ నగర్ లోజిల్లామాల మహానాడుఅధ్యక్షులు దారా అంజయ్య ఆద్వర్యంలో రాజ్యాంగదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ప్రతి పేద వాడు జీవిం చే హక్కు, ఓటుహక్కు రాజ్యాంగ బద్దంగా అందినవేనన్నారు. భారత రాజ్యాంగం వల్ల ఏకత్వంలో సమగ్రతను రక్షిస్తుందన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వై.ప్రభుదాసు, ఆరిక జయపాల్, పులుగు మోషే, వై. ఏడుకొండలు, బ్రహ్మయ్య రాజారావు తదితరులు పాల్గొన్నారు.
కే జీబీలోక్విజ్ పోటీలు…
కేజీబీవి విద్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురష్కరించుకుని బాలికలకు దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో క్విజోపోటీలు నిర్వహిం చారు. ఆ సందర్భంగా ఎంఈవో సుబ్బయ్య రాజ్యాంగవిలువలు, ఆచరించాల్సిన అ వసరం, రాజ్యాంగం అమలు వల్ల దేశాభివృద్ధి జరుగుతున్న వివరాలను తెలియపరి చారు.8.9.10 వతరగతి బాలికలకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి.సునీత, డిబీఆర్ సీ ఏరియా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు, సీఆర్పీలు తదితరులుపాల్గొన్నారు.


