బికేవీహైవే రోడ్డు నిర్మాణం కోసం నిత్యం తిరుగుతున్న టిప్పర్ల రాకపోకలతో శివరాం పురం-తాళ్లూరురోడ్డు పూర్తిగా ద్వంసంమైనా రోడ్డునిర్మాణ నిర్వహకులు పట్టించుకో పోవటంతో మరమ్మత్తులు చేయాలంటూ శివరాంపురం గ్రామ టీడీపీ యువత నారిపెద్ది కళ్యాణ చక్రవర్తి ఆద్వర్యంలో శి వరాంపురం, కొర్రపాటివారిపాలెం టీడీపీ శ్రేణులు టిప్పర్ల రాకపోకలను బుధవారం అడ్డుకున్నారు. నిత్యం వందలాది వాహనాలు ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిందన్నారు. గతంలో వేసిన బీటీ రోడ్డు మెటల్ రోడ్డుగా మారిందన్నారు. రోడ్డుపై ప్రయాణించే ద్విచక్రవాహనదాలు టిప్పర్ల వల్ల వచ్చే దుమ్ముకు ఆనారోగ్యం పాలవు తున్నారన్నారు. ఆదుమ్ములో వాహనాలు కన్పించక ప్రమాదాలు జరుగుతునా
తున్నారన్నారు. పలుగ్రామాలకు చెందిన ప్రజలు రోడ్డుకు మర్మమ్మత్తులు జరపాలని అనేక మార్లు హైవే నిర్మాణ నిర్వహకులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు.
రోడ్డు నిర్మాణ నిర్వహకులు పట్టించుకోక పోవటంతో శివరాంపురం టీడీపీ శ్రేణులు
రంగంలోకి దిగారు. కొర్రపాటివారిపాలెం కొండ నుండి సాగర్ కాలువ కట్టమీదుగా ఆర్అండ్ రోడ్డు పైకి వస్తున్న టిప్పర్లను నిలుపుదల చేశారు. రోడ్డుకుమరమ్మత్తులు చేసిన తరువాతనే వాహనాలు తిప్పాలని విన్నవించారు. రోడ్డు దుస్థితికి చెందిదుమ్ము లేయటం, గుంతలుగా వుండి వాహన చోదకులు ఇబ్బందులుపడుతున్నందున
తక్షణమే మరమ్మత్తులు జరిపించాలని కోరారు. రోడ్డు నిర్మాణ నిర్వహకులు స్థానిక పోలీసులను ఆశ్రయించి టిప్పర్లను అడ్డుకున్నారని తెలిపారు. పోలీసులు అడ్డుకున్న వారిని పిలిపించి మాట్లాడగా రోడ్డు పనులను తాము అడ్డుకోలేదని, వాహనాల రద్దీతో రోడ్డు పూర్తిగా దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల కష్టా లను గుర్తించి రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని, లేకుంటే తాము టిప్పర్లను తిరగనియ్యబోమని చెప్పారు. దీంతో రోడ్డు నిర్మాణ నిర్వహకులు రెండురోజుల్లో రోడ్డుకు మరమ్మత్తులు చేయిస్తామని పోలీసుల సమక్షంలో స్పష్టమైన హామీఇవ్వటంతో ఆయా గ్రామస్తులు అంగీకరించారు. దీంతో టిప్పర్లు యధా విధిగా హైవే రోడ్డునిర్మాణంకు మట్టి తోలాయి.


